హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈక్విటీ, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెరిగిన పెట్టుబడులు

జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లోకి నిధులు 20% పెరిగి, రూ.28,973 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయని యాంఫీ తెలిపింది. ఇందులో అత్యధికంగా మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.6,090 కోట్లు వచ్చాయి. అయితే డెట్ స్కీమ్‌ల ఉపసంహరణల వల్ల మొత్తం పరిశ్రమ నుండి రూ.52,949 కోట్లు తరలిపోయాయి. కాగా, మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల విలువ రూ.82.22 లక్షల కోట్లకు చేరింది.