హైదరాబాద్: 28°C
వ్యాపారం

జెరోదా vs గ్రో.. ‘ఎక్స్‌’ వార్‌

బ్రోకరేజీ సంస్థలు జెరోదా, గ్రో మధ్య ఫీజుల విధానంపై వాగ్వాదం నెలకొంది. పెట్టుబడి ఆధారంగా శాతం చొప్పున ఫీజుల వసూలును జెరోదా సీఈఓ నితిన్ కామత్ పరోక్షంగా విమర్శించారు. దీనిపై 'గ్రో' స్పందిస్తూ.. తమ 'ప్రైమ్' ఫీచర్ కేవలం ఇన్వెస్టర్ల గైడెన్స్ కోసమేనని, పాత ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. తమ ఆఫర్లపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చింది.