హైదరాబాద్: 28°C
క్రీడలు

క్వాలిఫయర్-2: టాస్ గెలిచిన కరీంనగర్

TG20లో భాగంగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరీంనగర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఈనెల 12న జరగనుంది.