హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 70,141 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,821 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది. రేపు రెండో శనివారం కావడంతో భక్తులు భారీగా తరలొచ్చే అవకాశం ఉంది.