హైదరాబాద్: 28°C
క్రీడలు

వింబుల్డన్ ఫైనల్లో కరోలినా ముచోవా

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవా సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో అమెరికా స్టార్, ఏడో సీడ్ కొకో గాఫ్‌పై 6-2, 1-6, 7-6 తేడాతో ముచోవా విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన నిర్ణయాత్మక మూడో సెట్ టై బ్రేక్‌లో గాఫ్‌ను చిత్తు చేసిన ముచోవా, తొలిసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.