హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: 102 మీటర్ల భారీ సిక్సర్

మేజర్ లీగ్ క్రికెట్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బ్యాటర్ ప్రిటోరియస్ విధ్వంసం సృష్టించాడు. ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే 5 సిక్సర్లు, 10 ఫోర్లతో 102* పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 144 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్ ప్రిటోరియస్ కొట్టిన 102 మీటర్ల భారీ సిక్సర్ స్టేడియం వెలుపల పడి అభిమానులను ఎంతగానో అలరించింది.