హైదరాబాద్: 28°C
క్రీడలు

తిలక్‌ వర్మ కంటే సంజు బెటర్: మాజీ ప్లేయర్

వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై మాజీ ఆటగాడు క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'తిలక్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అందుకే క్రీజులోకి వచ్చాక ఔట్ కాకూడదనే ఉద్దేశంతో ఆడుతున్నట్లు అనిపించింది. అతడి కంటే అక్షర్, సంజులను ఆడించడం నయం. తిలక్‌ను జట్టు నుంచి తప్పిస్తేనే మెరుగ్గా మారి తిరిగి వస్తాడు' అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.