హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఒకే రోజు రూ.5000 తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,44,490కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,32,450 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5000 తగ్గి రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.