హైదరాబాద్: 28°C
వార్తలు

టెన్త్ సర్టిఫికెట్ల సవరణకు మరో అవకాశం

అన్నమయ్య: జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కుల జాబితా, టీసీ వివరాల సవరణకు పాఠశాల హెచ్ఎంలకు మరో అవకాశం కల్పించినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. జూలై 8 నుంచి 10 వరకు పాఠశాల లాగిన్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు తదితరాలను ధ్రువీకరించి అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.