హైదరాబాద్: 28°C
వ్యాపారం

చాట్‌ జీపీటీ సేవల్లో అంతరాయం

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్‌తో పాటు ఇతర సర్వీస్‌ల్లోనూ సమస్య తలెత్తిందని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులను యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వెంటనే సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.