హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే ఇలా చేయండి

ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం రీహైడ్రేట్ అయి, జీవక్రియలు మెరుగవుతాయి. ఆపై 15-20 నిమిషాల పాటు యోగా, ధ్యానం లేదా వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉదయాన్నే ఫోన్ చూడటం తగ్గించి, రోజువారీ పనులపై దృష్టి పెట్టడం మంచిది.