KRNL: రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారిణి సబిహా పర్వీన్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నషాజహుర్ ముషాఫిర్ ఖానాలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
వార్తలు
11న విజయవాడలో మెగా జాబ్ మేళా


