హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ స్థాయిలో మెరిసిన జేపీఎన్సీఈ క్యాడెట్

మహబూబ్‌నగర్ జేపీఎన్సీఈ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ కే. యాదయ్య భారత వైమానిక దళం నిర్వహించిన ప్రతిష్టాత్మక "హెడ్ డౌన్ బెడ్ రెస్ట్ సిమ్యులేషన్" కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా నలుగురే ఎంపికైన ఈ కార్యక్రమంలో యాదయ్య ఎంపిక కావడం గర్వకారణమని ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ తెలిపారు.