హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు వాహనాలకు సాంకేతిక తనిఖీలు

BPT: అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు, బాపట్ల జిల్లా పోలీసు శాఖ తమ వాహనాలను సన్నద్ధం చేస్తోంది. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి 90 రోజులకు, ఒకసారి అన్ని పోలీసు వాహనాలకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న కుమారి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.