VKB: తాండూరు పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఇద్దరు ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారు. హుమ్లింగ్లా శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పర్వతారోహకుడు వినయ్ కుమార్, అలాగే అష్టావధానం పూర్తి చేసిన ధీరజ్ సాయిని స్థానిక శ్రీ భావిగి భద్రేశ్వరాలయంలో శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. వీరిద్దరి ప్రతిభ నేటి యువతకు ఎంతో ఆదర్శమని కొనియాడారు.
వార్తలు
తాండూర్‌లో యువ ప్రతిభావంతులకు సన్మానం


