హైదరాబాద్: 28°C
వార్తలు

కేసుల పరిష్కారానికి సహకరించండి: జడ్జి

W.G: ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా న్యాయవాదులు అందరూ సహకరించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ. వాసంతి కోరారు. మంగళవారం కోర్టు హాలులో బార్ అసోసియేషన్ సభ్యులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చి, ఎక్కువ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.