హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.కోటితో సీసీ డ్రెయిన్ల పనులకు శ్రీకారం

KMM: రూ.కోటి అంచనా వ్యయంతో నగరంలోని 58వ డివిజన్ బీసీ కాలనీలో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.