AP: NTR జిల్లా నందిగామలో ధోనీ భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. టీమిండియా మాజీ కెప్టెన్ M.S.ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా అంబారుపేట గ్రామంలో 77 అడుగుల కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రీడలు
నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్


