హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ 

TG: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకున్నారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి రెండుసార్లు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తాను అడిగి నిధులను ఇచ్చారని చెప్పారు. దీంతో అనుకున్న అభివృద్ధి పనులు మొదలయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే మొక్కు తీర్చుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చినట్లు వెల్లడించారు.