హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..?

ఉదయాన్నే నానబెట్టిన బాదం, కిస్మిస్ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆహారంలో సీజనల్ పండ్లు, తృణధాన్యాలు తప్పనిసరి. రాత్రి భోజనం త్వరగా ముగించడం మంచి అలవాటు. ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామాలు, ధ్యానం చేయాలి. అంతేకాదు రోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి. డీహైడ్రేషన్ అలసటకు ప్రధాన కారణం. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి.