హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాల ప్రాజెక్టు UPDATE

WNP: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు డ్యాం నీటిమట్టం 316.40 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.790 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆవిరి, ఇతర అవసరాల కోసం కలిపి 718 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.