మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షం బీభత్సం సృష్టించడంతో త్రయంబకేశ్వర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. నాసిక్-త్రయంబకేశ్వర్ హైవేపై వరద నీరు చేరింది. త్రయంబకేశ్వర్ పర్వతాల్లో కుండపోత వర్షానికి అధికారులు పాక్షికంగా హైవేను మూసివేశారు. నాసిక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
వార్తలు
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం మూసివేత


