హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,360 తగ్గి రూ.1,45,260కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,250 తగ్గి రూ.1,33,150 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.