హైదరాబాద్: 28°C
వ్యాపారం

కోటి ఫోల్డబుల్ ఐఫోన్లకు యాపిల్ ఆర్డర్!

తమ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఈ ఏడాది లాంచ్ చేసేందుకు యాపిల్ ప్రిపేర్ అవుతోంది. ఏకంగా కోటి ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని తమ సప్లయర్లకు సూచించినట్లు తెలుస్తోంది. సుమారు 7 కోట్ల యూనిట్ల ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌లను ఉత్పత్తి చేయనుందని సమాచారం. ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా ధర 2500 డాలర్లు(రూ.2.38 లక్షలు) ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.