శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత్-ఎ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక-ఎ రెండో ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ వికెట్లేమీ కోల్పోకుండా 36 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
క్రీడలు
శ్రీలంకపై భారత్ ఘన విజయం


