హైదరాబాద్: 28°C
క్రీడలు

FINAL: ఎవరిదో కప్పు?

లార్డ్స్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ENG, AUS తలపడనున్నాయి. ఆరుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా, సొంతగడ్డపై అజేయంగా దూసుకొచ్చిన 2009 ఛాంపియన్ ENGను తక్కువంచనా వేయలేం. గతంలో మూడుసార్లు ఆసీస్ చేతిలో ఫైనల్స్ ఓడిన ఇంగ్లాండ్, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ పోరు హోరాహోరీగా సాగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్.