హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్ర ఎక్కువైనా సమస్యేనట..!

నిద్ర లేకపోవడం ఎంత ప్రమాదమో, అవసరానికి మించి అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి అంతే హానికరం. సాధారణంగా 7-9 గంటల నిద్ర సరిపోతుంది. కానీ, అంతకంటే ఎక్కువ పడుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అతినిద్ర ఒంట్లో బద్ధకాన్ని పెంచి, మెదడు చురుకుదనాన్ని తగ్గిస్తుంది. సమతుల్యమైన నిద్ర మాత్రమే మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.