హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: అతివేగం.. నిండు ప్రాణం బలి

Advertisement

AP: బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో అతివేగం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. చినగంజాం మండలానికి చెందిన చల్లా సురేంద్ర(30) వాడరేవు బీచ్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించకపోవడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాలు అతివేగంగా నడపవద్దని, హెల్మెట్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement