TG: గంజాయి డాన్ నీతూ భాయ్ అనుచరుడు మోబిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి 26 కిలోల గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.26 లక్షలు ఉంటుందని తెలిపారు. మాదాపూర్ SOT, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. పరారీలో ఉన్న గంజాయి డాన్ నీతూ భాయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
క్రైమ్
నీతూ భాయ్ అనుచరుడు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


