హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. మామను హత్య చేసిన అల్లుడు

AP: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంకిపాడు మండలం కొల్వవెన్నులో కుమార్తెను వేధిస్తున్నాడని ప్రశ్నించినందుకు మామను అల్లుడు హత్య చేశాడు. మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చెక్కపీటతో తలపై కొట్టడంతో మామ నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కంకిపాడు PSలో కేసు నమోదు చేశారు.