హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షపు నీటితో నిండిన రహదారి.. ప్రయాణికులకు ఇబ్బందులు

SRD: కంగ్టి మండలం చౌకన్‌పల్లి వద్ద లోతట్టు ప్రదేశం రోడ్డులో కల్వర్టు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వర్షం వరద నీరు ప్రవహించింది. దీంతో ఇక్కడ లోతట్టు రోడ్డుపై గుంతలో వర్షపు నీరు నిలిచాయి. బైకులు, ఆటోలు, జీపులు ఈ గుంతలోంచి వెళ్లాలంటే నరకంగా ఉందన్నారు. ఇక్కడ కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు.