AP: దేశ భక్తి పెంపొందించే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ చేయాలన్నారు. SIRపై రాష్ట్ర యువ మోర్చా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి కార్యక్రమం మొక్క నాటడంతో ప్రారంభం కావాలని సూచించారు.
వార్తలు
'2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ చేయాలి'


