AP: బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన బస్సు.. చింతామణి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 10 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement


