హైదరాబాద్: 28°C
క్రైమ్

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

Advertisement

కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా బీర్‌లు తరలిస్తున్న కారును ఎక్సైజ్ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్&ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో యానం నుంచి అక్రమంగా తరలిస్తున్న 500 ml సామర్థ్యం గల 54 టిన్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement