హైదరాబాద్: 28°C
క్రీడలు

బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం

Advertisement

ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్-ఎలో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు.. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషానికే గోల్ సాధించింది. జులియన్ క్వినోన్స్ తొలిగోల్ చేయగా.. రెండో అర్ధభాగంలో రావుల్ జిమినెజ్ మరో గోల్ కొట్టి మెక్సికోను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

Advertisement

Advertisement