హైదరాబాద్: 28°C
క్రీడలు

INDW vs ENGW: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్.. వర్షంతో ఆట నిలిచే సమయానికి 14.1 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అమీ జోన్స్(64) హాఫ్ సెంచరీతో రాణించింది. ప్రస్తుతం బ్రంట్(30), కెంప్(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షఫాలీ, రేణుకా, రాధా తలో వికెట్ తీశారు.