హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమతి లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దు: ఏవో

MHBD: అనుమతి లేని విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని ఏవో రాజు సూచించారు. ఎస్సై ప్రశాంత్ బాబుతో కలిసి బుధవారం బయ్యారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ నిత్యం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.