హైదరాబాద్: 28°C
వార్తలు

సమగ్ర గర్భిణీ వైద్య సేవలే లక్ష్యం: డీఎంహెచ్‌వో

BHPL: గర్భిణీలకు నాణ్యమైన, సమగ్ర వైద్య సేవలు అందించడమే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లక్ష్యమని డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బుధవారం రేగొండ పీహెచ్‌సీలో ఆయన మాట్లాడుతూ.. తల్లి, శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైరిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.