హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఎక్కువ సలహాలిస్తే గందరగోళమే'

టీమ్‌ఇండియా టీ20 జట్టుతో పాటు ఆసియా గేమ్స్‌కు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడి శైలిని బట్టి అవసరమైనంత వరకే సలహాలు ఇస్తామని, ఎక్కువ సాయం చేస్తే గందరగోళం పెరుగుతుందని పేర్కొన్నాడు. ప్రతి ప్లేయర్‌కు ఒక సొంత ఆలోచనావిధానం ఉంటుందని, కోచ్‌గా వారితో కలిసి పనిచేయడం ఒక సవాల్ లాంటిదని కోటక్ అభిప్రాయపడ్డాడు.