హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పర్యటన వివరాలను పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు సీతారాంపల్లిలో నీలమణి దుర్గ అమ్మవారి వార్షికోత్సవం, 11 గంటలకు అచ్చుతాపురంలో రజస్వల మహోత్సవం, 12 గంటలకు రాజపురంలో పోలమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30కు దిమిలి గ్రామ దేవత ఉత్సవాల అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.