హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబై టీ20 లీగ్‌లో సూర్యకుమార్ ఊచకోత

ఫామ్‌ లేమితో భారత టీ20 జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్, ముంబై టీ20 లీగ్‌లో చెలరేగిపోతున్నాడు. వేటు పడిన మరుసటి రోజే 24బంతుల్లో 48పరుగులు చేసిన అతడు, తాజా మ్యాచ్‌లో 36 బంతుల్లోనే 72 రన్స్ బాదాడు. జట్టు విజయం తర్వాత తనకు దక్కిన 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును, ఐదు వికెట్లు తీసిన సహచర బౌలర్ డిసౌజాకు అందిస్తూ సూర్య గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.