హైదరాబాద్: 28°C
వార్తలు

15 మంది అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ

SRCL: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 65 ఏళ్లు నిండిన 15 మంది సిబ్బందికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదవీ విరమణ కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం తెలిపారు. కలెక్టర్ అనుమతితో వేములవాడ ప్రాజెక్టు నుంచి ఇద్దరు, సిరిసిల్ల ప్రాజెక్టు నుంచి 13 మందికి ఈ అవకాశం కల్పించారు. వీరిలో 8 మంది టీచర్లు, 7 గురు హెల్పర్లు ఉన్నారు.