హైదరాబాద్: 28°C
వార్తలు

మట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేత

SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజి వాగు వద్ద తాత్కాలిక మట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం జెసీబీ సహాయంతో పూడ్చి వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఉపేందర్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు వెంకటేష్, మధుకర్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.