KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో పర్లపల్లికి చెందిన ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్రైమ్
ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి


