హైదరాబాద్: 28°C
క్రీడలు

SL vs WI: రెండో వన్డే వర్షార్పణం

శ్రీలంక, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే మూడో వన్డే జరగనుంది.