హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం విజయ్

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులతో కలిసి తమిళనాడు సీఎం విజయ్‌ని ప్రజ్ఞానంద మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా విజయ్.. ప్రజ్ఞానందను అభినందించారు. అతడికి రూ.50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. అనంతరం అతడితో కలిసి సరదాగా కాసేపు చెస్ ఆడారు.