హైదరాబాద్: 28°C
వార్తలు

మక్తల్‌లో మంత్రి ఏడాది పాలన సంబరాలు

NRPT: వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పాలనలో భారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గడిచిన ఏడాది కాలంలోనే అనేక మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.