సత్యసాయి: కనగానపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల నుంచి స్కూటీపై స్థానిక చెరువు వరకు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రయాణించారు. చెరువు మరమ్మత్తు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును, ప్రగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వార్తలు
స్కూటీపై ప్రయాణించిన ఎమ్మెల్యే


