హైదరాబాద్: 28°C
వార్తలు

స్మార్ట్ కిచెన్ల రద్దు చేయాలని ధర్నా

శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్రీకృత వంటశాలలు విద్యార్థులు, కార్మికులకు నష్టదాయకమన్నారు. స్మార్ట్ కిచెన్లను రద్దు చేసి ప్రస్తుత కార్మికులతోనే పథకం కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.