PLD: నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29న గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతోరణాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఉదయం కాకడ హారతి, పంచామృతాభిషేకం, నూతన వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణ, చోటా హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కమిటీ తెలిపారు.
వార్తలు
గురు పౌర్ణమికి ముస్తాబవుతున్న ఆలయం


